Consumer
అతితక్కువ సమయంలో ప్లైవుడ్ యొక్క వాస్తవికతను సరి చూసుకోండి

ఈ పరిశ్రమ ఇంతకు ముందెప్పుడూ లేనంతగా విరాజిల్లుతోంది, మరియు రాబోవు సంవత్సరాల్లో అది ఇదేవిధంగానే కొనసాగుతుంది.  ప్లైవుడ్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉన్నాయి, మరి దీనితో, ఒక ముఖ్యమైన ఐతే విషమమైన అంశం ఒకటి రంగం లోనికి దిగింది: పరిశ్రమలోనికి నకిలీ ఉత్పత్తుల రాక పెరిగిపోవడం.  పైన చెప్పబడిన విధంగా, ప్లైవుడ్ ధరలు ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉండటంతో, మీరు కొంటున్న ప్లైవుడ్ నిజమైన నాణ్యత కలిగి ఉందా మరియు మీరు చెల్లించిన ధరకు తగ్గట్టుగా ఉందా ప్లైవుడ్ వారంటీ ఉందా అని తెలుసుకోవడానికి ఏ మార్గమూ లేదు. మీరు నివసిస్తున్న చోటుల కోసం ఉత్తమమైన ప్రోడక్టును వెతుకుతూ రోజుల కొద్దీ కాలం గడిపినప్పటికీ కూడా, మీరు నకిలీ ఉత్పాదనను కొనే అవకాశం ఉండనే ఉంటుంది.

తక్కువ-నాణ్యత కల ఉత్పత్తులు అవి ఎప్పటికీ సాధించలేని మరియు సాధించని లక్షణాల జాబితాతో అమ్ముడవుతున్నాయి.  అసలు విషయం తెలియని కొనుగోలుదారు ఈ నకిలీ ఉత్పత్తులను కొన్నప్పుడు, అవి ఆశించిన విధంగా పని చేయడంలో విఫలమైనప్పుడు, అవి ఎల్లప్పుడూ విఫలమౌతూ ఉన్నప్పుడు, వారు అయోమయానికి మరియు అపనమ్మకానికీ గురవుతారు.

మేము సెంచురీప్లై వద్ద, వినియోగదారు రాబోయే ఐదు సంవత్సరాల పాటు నిలిచి ఉండాలని కోరుకునేది ఏదైనా కొనేటప్పుడు మేము మధ్యదళారీలపై ఆధారపడే సంప్రదాయం పట్ల కచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాము. ఇక్కడే సెంచురీప్రామిస్ యాప్ రంగం లోనికి అడుగుపెడుతుంది.

సాంకేతికపరమైన పురోగతులకు ధన్యవాదాలు, పైన కనబరచిన అయోమయం కోసం సెంచురీప్లై ఒక విప్లవాత్మకమైన పరిష్కారముతో ముందుకు రాగలిగింది: అదే సెంచురీప్రామిస్ యాప్. తన కస్టమర్లకు సర్వోత్తమమైన నాణ్యతను అందించాలనే తన ప్రధాన దృష్టి సారింపుతో, తన కస్టమర్లు కొనే ఉత్పత్తులు అత్యుత్తమమైనవి, తయారీ చేయు దశలో క్రమం తప్పని నాణ్యతా పరిశీలనకు గురై ఉండినవి మరియు మార్కెట్‌లో మరేదీ సాటి రానటువంటివిగా ఉండేలా చూసుకోవడానికి సహాయపడే ఒక మార్గముగా మార్కెట్‌లోని అత్యంత విశ్వసనీయమైన రూపకర్తలలో ఒకరిచే సెంచురీప్రామిస్ రూపొందించబడింది.

ఈ సాఫ్ట్ వేర్ యొక్క అత్యంత ముఖ్యమైన మరియు ఆకట్టుకునే అంశము ఏమిటంటే, కొత్తగా కొనుగోలు చేయబడిన ప్లైవుడ్‌ని మదింపు చేయడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు.  ఆ ప్లైవుడ్ వారంటీ కి సంబంధించిన ప్రాథమిక సమాచారమునంతటినీ పొందడానికి మీరు చేయవలసిందల్లా ఒక క్యుఆర్ (QR) కోడ్ స్కాన్ చేయడమే.  ఒక వ్యక్తి ఒక స్థానిక షాపు నుండి సెంచురీ ప్లైవుడ్ తెచ్చుకున్నట్లయితే, వారు దానిపై ఉన్న క్యుఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా దాని అధీకరణను త్వరగా నిర్ణయించవచ్చు. ఆ ప్లై గురించిన మొత్తం సమాచారాన్ని యాప్ అప్పటికప్పుడు డిస్‌ప్లే చేస్తుంది, మీరు ప్రశస్తమైనది కొన్నారా లేక నకిలీది కొన్నారా అనేది నిర్ధారించుకోవడానికి మీకు వీలు కలిగిస్తుంది.

అది ఇక్కడితోనే ఆగిపోదు! మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ మరియు మొబైల్ నంబరుపై ఒక వ్యారెంటీ కార్డును అందుకున్నప్పటికీ, యాప్ నుండే ప్లైవుడ్ వారంటీ యొక్క ఇ-వ్యారెంటీని జనరేట్ చేయడానికి మరియు భవిష్యత్ ఉపయోగానికై కేవలం రెట్టింపు భద్రతను నిర్ధారించుకోవడానికి మీకు మీరుగా ఒక కాపీని సేవ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ మీకు వీలు కలిగిస్తుంది.

ఈ యాప్ ఒక ఫీడ్‌బ్యాక్ విభాగముతో కూడా వస్తుంది, అక్కడ మీరు యాప్ ఉపయోగించి మీ అనుభవం మరియు ఏదైతే మెరుగ్గా ఉండేదో దాని గురించి కూడా వ్రాయవచ్చు.  మమ్మల్ని నమ్మండి, మేము ఎల్లప్పుడూ ఫీడ్‌బ్యాక్ పట్ల సానుకూలంగా ఉంటాము!

మేము “రహో బేఫికర్ అని చెప్పినప్పుడు, అక్షరాలా దాని అర్థం ఏమిటంటే, నిశ్చింతగా ఉండండి అని మరియు ఈ యాప్ వెనుక గల మా ప్రేరణను ఇది క్రోడీకరిస్తుంది అని అర్థం.


Leave a Comment

Loading categories...

Latest Blogs