Consumer
మీ ప్లైవుడ్ కొనుగోలు యొక్క అధీకరణను ఎలా సరిచూసుకోవాలో ఇదిగో ఇక్కడ

ప్లైవుడ్ అనేది ఈ రోజుల్లో ఒక ఆవశ్యకమైన భవన నిర్మాణ సామాగ్రిగా ఉంటోంది, చుట్టూ చూడండి, మీరే ఆ విషయాన్ని గ్రహిస్తారు. మనందరమూ ప్లైవుడ్ చే చుట్టుముట్టబడి ఉంటున్నాము, మంచాల నుండి కప్ బోర్డుల దాకా, అంతెందుకు డోర్లు సైతమూ, ప్రతిచోటా ప్లైవుడ్ ఉంటోంది. అందువల్ల, మీ ఇంటిని నిర్మించుకునేటప్పుడు ప్లైవుడ్ ని ఒక ఖర్చు లాగా కాకుండా ఒక పెట్టుబడిగా చూడడం ఎంతో ముఖ్యం.

సెంచురీప్లై అనేది ఈ రోజు బారతీయ మార్కెట్లోని అత్యంత పురాతనమైన మరియు అత్యంత సుప్రసిద్ధి చెందిన ప్లైవుడ్ బ్రాండుగా ఉంటోంది. మా మూలములో సుస్థిరమైన అన్వేషణతో, మేము మరే ప్లైవుడ్ ఉత్పత్తిదారుడూ ఇవ్వలేని అత్యుత్తమ ఉత్పత్తులను ఇవ్వడమే లక్ష్యంగా చేసుకున్నాము. మా భారీ నిపుణుల బృందము మీకు అత్యంత ఉత్తమ నాణ్యత గల ఉత్పత్తులను అందించడానికి 24/7 కష్టించి ఎడతెగని విధంగా పనిచేస్తున్నారు.

ఐతే మార్కెట్‌లో సంక్లిష్టత పెరిగిపోయిన కారణంగా అనేక సవాళ్ళు, సమస్యలు రూపు దిద్దుకుంటున్నాయి, అటువంటి సవాళ్ళలో ఒకటి నకిలీ అమ్మకందారులు. పోటీ పెరిగిపోవడంతో, నకిలీ కూడా పెరిగిపోతోంది, మరి అందువల్ల మేము మరొక సమస్యతో వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు గాను, మా పరిశోధన మరియు అభివృద్ధి బృందము యొక్క ఆలోచనే సెంచురీప్రామిస్.

సెంచురీప్రామిస్: ప్రశస్తత కోసం వాగ్దానం

సెంచురీప్రామిస్ అనేది ప్లైవుడ్ ని సులభంగా అధీకృతపరచడానికి మాత్రమే అభివృద్ధి చేసిన ఒక అప్లికేషన్.

ఫైర్‌వాల్,వైరోకిల్ మొదలగు వంటి విప్లవాత్మకమైన టెక్నాలజీల చేర్పుతో, ఈ టెక్నాలజీలను అధీకృతపరచడానికి మరొక సానుకూల మార్గము లేనందువల్ల, మీరు సరియైన ఉత్పాదనను కొనుగోలు చేసుకునేలా మేము నిర్ధారించుకోవాలనుకున్నాము.

దీనిని ఉపయోగించడమెలా?

ఈ అప్లికేషన్, ప్లైవుడ్ యొక్క టోకు కొనుగోళ్ళకు సైతమూ ఉపయోగించడానికి సులభము మరియు సులభంగా పని చేస్తుంది కూడా. కస్టమరు కేవలం తన మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ పైన అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఆ తర్వాత ప్రోడక్టు యొక్క QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రతియొక్క సెంచురీప్లై ఉత్పాదన ఒక విశిష్టమైన QR కోడ్ తో వస్తుంది, అది ఉత్పాదన యొక్క వివిధ స్పెసిఫికేషన్లను జాబితా చేస్తుంది మరి తద్వారా ఈ అప్లికేషన్ ఉపయోగించడం వల్ల మీరు సులభంగా ఒక ఒరిజినల్ సెంచురీప్లై ఉత్పాదనను నకిలీ నుండి స్పష్టంగా వేరు చేసి గుర్తుపట్టవచ్చు.

ఈ క్రింద జాబితా చేయబడిన అంశాలు సెంచురీప్రామిస్ యాప్ ఉపయోగించడానికి దశల వారీ పద్ధతులు:

1. యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి: మీ యాప్ స్టోర్ నుండి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి, ఈ అప్లికేషన్ ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ రెండింటిపైనా లభిస్తుంది.

2. స్కాన్ చేయండి, స్కామ్ లో పడిపోవద్దు: ప్రతియొక్క సెంచురీప్లై ఉత్పాదన పైన ఒక విశిష్టమైన QR కోడ్ ముద్రించబడి ఉంటుంది, సెంచురీప్రామిస్ యాప్ లో అంతర్నిర్మితమైన క్యుఆర్ కోడ్ స్కానర్ ఉపయోగించి దానిని స్కాన్ చేయండి.

3. ఫలితాలు: ఒకవేళ ఉత్పాదన ఒరిజినల్ కాకుంటే, యాప్ ఆటోమేటిక్ గా “ప్రశస్తమైన సెంచురీప్లై ఉత్పాదన కాదు” అని డిస్‌ప్లే చేస్తుంది.

4. వ్యారెంటీ జనరేట్ చేయండి: ఒకవేళ ఉత్పాదన ఒరిజినల్ అయి ఉంటే, మీరు యాప్ నుండే నేరుగా ఇ-వ్యారెంటీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఏవైనా భవిష్యత్ అవసరాల కోసం వద్ద ఉంచుకోవచ్చు.

ముగింపు

ఈ రోజుల్లో సరియైన ప్లైవుడ్ ఉత్పాదనను కొనుగోలు చేయడమనేది చాలా సమస్యలతో కూడుకున్న పని, కాబట్టి తర్వాతిసారి మీరు మీ ఇంటీరియర్ అవసరాల కోసం ప్లైవుడ్ కొనుగోలు చేసేటప్పుడు, అత్యంత చక్కనైన నాణ్యత గల మరియు ఒరిజినల్ ప్లైవుడ్ కోసంసెంచురీప్లై ఎంచుకోండి మరియు సెంచురీప్రామిస్ ఉపయోగించి మీ కొనుగోలును నిర్ధారణ చేసేలా చూసుకోండి.

Leave a Comment

Loading categories...

Latest Blogs